అమీన్పూర్(జిన్నారం) ఏప్రిల్ 8 : హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ పరిధిలో వివాదాస్పద రైతుల భూములను బుధవారం మందకృష్ణ మాదిగ పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సంబంధించి తీర్పు వచ్చే వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలన్నారు. కోర్టు పరిధిలో లేని రైతుల భూముల జోలికి హైడ్రా రావద్దని తెలిపారు. రైతులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ ముఖీం, ఎమ్మార్పీఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.