Ala Venkateshwar Reddy | ఆంధ్రాకు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే ఆల ఆరోపణ
Ala Venkateshwar Reddy | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
మహబూబ్నగర్ : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా ( Andhra ) కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ ( CM Revanth ) లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సీఎం హడావుడిగా ప్రాజెక్టులను సందర్శించారని పేర్కొన్నారు. ఆయన పర్యటనలో ప్రాజెక్టుల పూర్తికి తీసుకోవలసిన చర్యలపై కాకుండా మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. గడిచిన రెండేళ్లల్లో సమయాన్నివృధా చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై అవగాహన, స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
అబద్ధపు పునాదుల మీద ఏర్పాటైన ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఐదు రిజర్వాయర్ల కోసం 27వేల ఎకరాలు భూసేకరణ జరిగిందని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14లో 12 సీట్లు గెలిపిస్తే జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని వెల్లడించారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా సాగు ఎట్లా పెరిగిందని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల నుంచి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
జూరాల సోర్స్ తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఎట్లా అందుతాయో చెప్పలేదని ఆరోపించారు. ఆంధ్రా, కర్ణాటకకు మేలు చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు జిల్లా మీద ప్రేమ ఉంది కాబట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని, కేసులు వేయక పోతే తమ హయాంలోనే మొత్తం పూర్తి చేసే వాళ్లమని తెలిపారు. విలేకరుల సమావేశంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,అంజయ్య యాదవ్ , మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ ,ఇంతియాజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

