హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 32వ సారి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కా ర్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నా రు. పీసీసీ కార్యవర్గాన్ని ఖరారు చేస్తారని సమాచారం. మొత్తం నాలుగు పోస్టులు ఉండగా, ఇప్పటికే ఒక్కో పోస్టుకు ముగ్గు రు పేర్ల చొప్పున జాబితా సిద్ధమైందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి శనివా రం జాబితా విడుదల చేస్తారని విశ్వసనీ య వర్గాల సమాచారం. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం.