హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17 నుంచి 23 వరకు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నట్టు సీఎంవో ఆదివారం ప్రకటించింది. 17న సీఎం బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. 18న సింగపూర్ చేరుకొని షాపింగ్ మా ల్స్, స్టేడియాల నిర్మాణాల పరిశీలన అనంతరం పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్‌కు వెళ్తారు. 23న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని స్వదేశానికి తిరుగు పయనమవుతారు.