హైదరాబాద్: 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటని ప్రశ్నించారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని, రేవంత్ చేతకానితనం అన్నదాతలకు కోలుకోని శాపమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘‘20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ??
అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ??. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది..
వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది..
ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా..
మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం..— KTR (@KTRBRS) October 4, 2024