హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాం శం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తున్నదని కొనియాడారు. ఇతరులపై ప్రేమ, సహనం, శాంతి, సేవాభా వం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మ నందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఏసు బోధనలు అనుసరించి అన్నిమతాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.