హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ ని ర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. గణతంత్రం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు.