హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి గురువారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాల జరుగుతుండటంతో ఏ సమయానికి వెళ్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మంగళవారం ఢిల్లీకి వెళ్లి బుధవారమే రాష్ర్టానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి మరునాడే ఢిల్లీకి వెళ్లనున్నారు.