హైదారాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది 42వ సారి. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరవుతారని సీఎంవో ప్ర కటించింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వివిధ రాష్ర్టాలను చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.