Jishnudev Varma | తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణుదేవ్ శర్మ దంపతులకు సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. అలాగే త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఇతర ఉన్నత అధికారులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్‌గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ వ్యవహరించిన విషయం తెలిసిందే. రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది.