హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు తీసుకొని తయారు చేశామని తెలిపారు.
భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్‌సిటీలో ప్రభుత్వం రెండురోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం 83 పేజీలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ము గింపు సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2034 నాటికి లక్ష కోట్ల డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు వివరించా రు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు.