హైదరాబాద్ : తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆధ్యుడు దొడ్డి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. ప్రజా పాలన దినోత్సవం(Prajapalana dinostavam) సందర్భంగా సీఎం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా. తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు అన్నారు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిం చాం. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది. అందుకే..ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ..‘ప్రజా పాలన దినోత్సవం’ గా నామకరణం చేశామన్నారు.
తెలంగాణ ఫ్యూచర్ స్టేట్‌గా మాత్రమే కాదు… క్లీన్ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుందన్నారు.
,,Telangana,Telangana news