హైదరాబాద్: సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని చెప్పారు. ప్రజలకు శాంతి, మతసామరస్యం, విద్యను అందించారని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయన తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో తమను మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పారు.
వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశ స్ఫూర్తితో ముందుకుసాగాలని తెలిపారు.