హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ విమానం ఎక్కారు. ఆయనసోమవారం సాయంత్రం దేశ రాజధాని నగరానికి పయనమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 53వసారి కావడం గమనార్హం.
మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే.