హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పెద్దలతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ర్టానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్న ట్టు తెలిసింది.
మరోదఫా మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీ, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. రేవంత్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లడం ఇది 47వసారి.