హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తె లంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. మంగళవారం సాయం త్రం ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఒక ఆంగ్ల ప్రతిక నిర్వహించనున్న కాంక్లేవ్‌లో రేవంత్‌రెడ్డి పా ల్గొంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. కాంక్లేవ్ అనంతరం పార్టీ అధిష్ఠాన పెద్దలను కలిసి తన ఏడాది పాలనా ఉత్సవాలకు ఆ హ్వానించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలూ చర్చించనున్నట్టు తెలిసింది. తిరిగి మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారని, తిరిగి అదే రోజు 13న రేవంత్‌రెడ్డి ముంబై వెళ్లి ఎన్నికల ప్రచారంలో పా ల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లడం ఇది 25వ సారి.