హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి 51వ సారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నుంచి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, మంత్రులు, టీపీసీసీ నేతలు వెళ్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఆయా కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.