హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే జనవరిలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు తెలిసింది. షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్టు సమాచా రం. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి 12 వరకు సీఎం అమెరికాలో పర్యటించారు. ఇప్పుడు ఐదు నెలలకే మరోసారి అమెరికా వెళ్తుండటం గమనార్హం. గతంలో మాదిరిగానే ‘రాష్ర్టానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పర్యటన ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపం చ ఆర్థిక వేదిక-2025 (డబ్ల్యూఈఎఫ్) సద స్సు జనవరి 20న ప్రారంభం కానున్నది. సీఎం అమెరికా పర్యటన ముగించుకొని నేరు గా ఈ సదస్సుకు వెళ్తారన్న చర్చ జరుగుతున్న ది. అయితే దావోస్ సదస్సుకు రేవంత్ హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. సీఎం అమెరికా పర్యటన నేపథ్యంలో డిసెంబర్లోనే అసెంబ్లీ సమావేశాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. చివరగా ఈ ఏడాది జూలై 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆరు నెలల్లోగా కచ్చితంగా సమావేశాలు నిర్వహించాలన్న గడువు ఉంది.
9 నెలల్లో ఐదు దేశాల్లో పర్యటన
అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లోనే సీఎం ఐదు దేశాల్లో పర్యటించారు. మొదటిసారి 3 దేశాలు, రెండో పర్యటనలో 2 దేశాల్లో పర్యటించారు. మొదట జనవరి 15నుంచి 18 వరకు దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత బ్రిటన్ వెళ్లా రు. రెండు రోజులపాటు లండన్‌లో పర్యటించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి లండన్ షార్ట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి 21న దుబాయ్‌కి చేరుకున్నారు. రెండు రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఆగస్టులో రెండో విడత విదేశీ పర్యటనలో 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అమెరికా, దక్షిణ కొరియా వెళ్లారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ఐదు దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఇప్పుడు మూడో విడత విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.