Revanth Reddy | వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం.. ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్
Revanth Reddy | ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు.
Revanth Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటిస్తున్న ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు. ఏది పడితే అది చేస్తే చూస్తూ ఊరుకోవాలని అని మండిపడ్డారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమని అన్నారు. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్య అనేది సేవ అని.. దాన్ని వ్యాపారం చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసని అన్నారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని తెలిపారు. అరోరా కాలేజీ రమేశ్‌కు ఎన్ని అనుమతులు ఇవ్వాలని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామని హెచ్చరించారు. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారని అన్నారు. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అని నిలదీశారు. పాలమూరులో జయప్రకాశ్‌కు హైదరాబాద్‌లో క్యాంపస్ ఎందుకు అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

