CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా గాంధీల కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒలకబోసిన ప్రేమను చూసి కాంగ్రెస్‌వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్న మొన్న పార్టీలో చేరిన ఆయన పుట్టు కాంగ్రెస్‌వాదిగా నీతులు చెప్తుం టే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ ఆయిపోయారు. రేవంత్‌రెడ్డి అతి వినయంపై పార్టీ లో జోరుగా చర్చ జరుగుతున్నది.
అదే సమయంలో అధికారిక కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేస్తూ తిట్ల దండకం ఎత్తుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని పప్పు అంటూ కించపరిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాళ్లను పొగుడుతుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారు. నాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి అయిందా అని ప్రశ్నిస్తున్నారు. వారి కుటుంబ చరిత్ర చెప్పడంపైనా ఆశ్చర్యపోతున్నారు. కొత్త భక్తుడు ఒళ్లంతా బొ ట్లు పెట్టుకున్నట్టు ఆరేండ్ల క్రి తం కాం గ్రెస్‌లో చేరిన ఆయ న, పుట్టు కాంగ్రెస్ వాదులకన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ, గాంధీల కుటుంబం గురించి చెప్పడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ వల్లే, సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి పేర్కొనడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డికి అమరుల త్యా గాలు గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వస్తే వందలమంది విద్యార్థులు ఎందుకు బలయ్యారని నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రజలు, అమరుల త్యాగాలను పక్కన పెట్టి కేవలం సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ను ప్రధానమంత్రిని చేసింది సోనియాగాంధీ కాదా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అదే పీవీని ఇదే సోనియాగాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదా? అని గుర్తుచేస్తున్నారు. పార్టీని కష్టకాలంలో ఆదుకొని, దేశా న్ని నడిపించిన పీవీ మరణం తర్వాత కనీసం ఆయన మృతదేహాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి కూడా తీసుకురానివ్వకుండా అ డ్డుకున్నది నిజం కాదా? అని నిలదీస్తున్నారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా న్ని, సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఫిబ్రవరిలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఆరు నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన రాజీవ్ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించి ప్రా రంభించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మా త్రం డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని చెప్పా రు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని రోజుల వ్యవధిలోనే తయారు చేయించి ప్రారంభించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో ఎందుకు ఆలస్యం అవుతుందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ది కుటుంబ పార్టీ అని, గాంధీలది మాత్రం స్వాతంత్య్ర పోరాట కుటుంబమని రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాల్గొన్న విషయాన్ని కాదనలేమని, కానీ, తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని, ఆయన చేసిన త్యాగాలను కించపరచడంపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం చేసిన పోరాటం దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం కన్నా తక్కువేమీ కాదని గుర్తుచేస్తున్నారు. గాంధీలది కుటుంబ రాజకీయం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ సభ కార్యక్రమం అధికారిక కార్యక్రమం. ఈ విషయాన్ని మర్చిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని రాజకీయ సభలాగా మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక సభలో సీఎం మాదిరిగా మాట్లాడకుండా రాజకీయ సభలో రాజకీయ నేతలా తిట్ల దండకం ఎత్తుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం స్థాయిలో ఉంటూ ప్రజలు ఏమనుకుంటారనే ఇంగితం లేకుండా సన్నాసి, బలుపు, దిక్కుమాలినోడు అని వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ మహానీయులను గౌరవించే దిశగా నాటి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ సార్ పేరు పెట్టగా, ఉద్యాన వర్సిటీకి కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నర్సింహారావు పేరు పెట్టి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చారు. వీటన్నింటినీ మర్చిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా అబద్ధపు ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.