CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జీవో-29 ప్రకారమే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ మేరకే మె యిన్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన ‘పోలీస్ డ్యూటీ మీట్-2024’ ము గింపు కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. పోలీస్ సిబ్బంది పిల్లలకోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండి యా పోలీస్ స్కూల్‌ను ప్రారంభిస్తామన్నారు. జీవో-29 ప్రకారమే ప్రిలి మ్స్ ఫలితాల్లో 1:50 ప్రకారం మెయిన్‌కు సెలెక్ట్ చేశామని తెలిపారు. కోర్టు లు కూడా ప్రభుత్వం చేపట్టిన పరీక్ష వి ధానాన్ని సమర్థించాయని గుర్తుచేశా రు. సోమవారం నుంచి గ్రూప్-1 ప రీక్షలు జరుగుతాయని అభ్యర్థులం తా హాజరుకావాలన్నారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై కేసులు పెట్టొద్దని పోలీసులకు సూచించారు.
మంత్రుల తర్జనభర్జన
జీవో 29ను రద్దు, గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని పెద్ద సంఖ్య లో అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడినట్టు తెలిసింది. నిరసనలను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షలపై ఏం చేయాలని మంత్రుల్లో చర్చ ఉత్పన్నమైనట్టు సమాచారం. ఇందులో భా గంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహే శ్ కుమార్‌గౌడ్, పలువురు మంత్రు లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. చర్చల్లో మంత్రులు దా మోదర రాజ నర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. వీరంతా గ్రూప్-1 పరీక్షలు, జీవో 29 అంశం, అభ్యర్థుల విజ్ఞప్తులు, అభ్యంతరాలు, వాయిదా సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘం గా చర్చించినట్టు తెలిసింది.
వాయిదా కోరిన పీసీసీ చీఫ్?
గురువారం గ్రూప్-1 అభ్యర్థుల తో మాట్లాడిన సందర్భంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వారికి ఇచ్చి న హామీ మేరకు ఈ పరీక్షలు వా యిదా వేయాలని మంత్రులను కోరినట్టు తెలిసింది. శనివారం భారీస్థాయిలో ఆందోళన జరగడం, అందుకు ప్రతిపక్షాలు కలిసి రావడంతో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వస్తుందనే అంశాన్ని మహేశ్‌కుమార్ గౌడ్ చర్చల్లో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్కు ఈ విషయంలో అస్ర్తాన్ని ఇచ్చామని బాధపడుతున్న కొందరు మంత్రులు సైతం.. ఇదే అంశాన్ని ప్ర స్తావించినట్టు తెలిసింది. పరీక్షలు క చ్చితంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం, ఏర్పాట్లు కూడా పూ ర్తవడంతో తాజా పరిణామాలపై మం త్రులు తర్జనభర్జన పడ్డట్టు తెలిసింది.
న్యాయపరంగా వెళ్లాలనే చర్చ
జీవో 29పై న్యాయపరంగా ముం దుకు వెళ్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా మంత్రులు చర్చించిచట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే పరిణామాలు ఏంటి? లేదా జీవోలో మార్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే అంశం పై చర్చించినట్టు సమాచారం. అభ్యర్థులెవరికీ నష్టం జరగదని బుజ్జగిస్తూనే పరీక్షలపై ముందుకు వెళ్లేలా నేడు మీడియా ముఖంగా సమగ్ర ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.