హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గచ్చిబౌలిలో స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఐఎస్బీలో నిర్వహించిన లీడర్షిప్-24 సమ్మిట్‌కు సీఎం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగ గుణం ఉండాలని సూచించారు. జీవితంలో రాణించాలంటే రిస్క్ తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం న్యూ యార్క్, పారిస్, టోక్యో, సియోల్ లాంటి సిటీలతో పోటీపడాలని ఆకాంక్షించారు. ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతోపాటు న్యూ ఇండియాకు అంబాసిడర్లని అభివర్ణించారు.