హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురోగాభివృద్ధికి సహకారం అందిస్తామని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీజే పాండియన్ అన్నారు. గురువారం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు, రాష్ట్రంలో శిక్షణ సంస్థ ల ఏర్పాటునకు సహకరించాలని, హాస్పిటళ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఇరువురి మధ్య జరిగిన చర్చల్లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రస్తావన కూడా వచ్చింది.