రంగారెడ్డి, జూలై 14(నమస్తే తెలంగాణ): నిరుద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉ న్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వద్దని మ రికొందరు అంటున్నారని పేర్కొన్నారు. పరీక్షల వాయిదా కోసం రోడ్డెక్కే బదులు మంత్రులను కలిసి వారి బాధలు చెప్పుకోవాలని సూచించా రు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆదివారం ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గౌడన్నల కృషి ఉన్నదని చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న రూ.7.9 కోట్ల ఎక్స్‌గ్రేషియా నిధుల విడుదలకు ఆదేశాలు జారీచేశారు. వేదిక ఆవరణలో సీఎం ఈత మొక్కలు నాటారు. గీత కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రులకు గీత కార్మికులు మోకు, కల్లు కుండలను బహూకరించారు.
సేఫ్టీ కిట్లను స్వయంగా పరీక్షించిన సీఎం
లష్కర్‌గూడ వేదికగా బీసీ కార్పొరేషన్ ద్వా రా 10వేల మందికి సేఫ్టీకిట్లను సీఎం తన చే తుల మీదుగా కొందరికి పంపిణీ చేశారు. అంతకుముందు స్పీకర్, మంత్రులతో కలిసి కిట్ల పనితీరును రేవంత్ స్వయంగా పరిశీలించారు. అంతకుముందు వాటి పనితీరును బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సీఎంకు వివరించారు. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థుల బృందం ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీకిట్లను తయారుచేసినట్టు తెలిపారు.
ఎవరెస్టును అధిరోహించిన వారి సూచనలతో వీటికి రూపకల్పన చేసినట్టు వివరించారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ఐదెకరాలు ఇవ్వాలని, వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా గీత కార్మికులు సీఎంను కోరారు. దీనికి రేవంత్ సానుకూలంగా స్పందించారు. రియల్ ఎస్టేట్ పెరగడం వల తాటి వనాలు తగ్గుతున్నట్టు చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్ల పక్కన, వెంచర్ల ఏర్పాటు సందర్భంగా తాటి, ఈత చెట్లను నాటాలనే నిబంధన విధిస్తామని పేర్కొన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన వారంతా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చిదిద్దాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లాకు మహర్దశ
రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ చుట్టూ మణిహారంలా ఏర్పాటవుతున్న రీజినల్ రింగ్‌రోడ్డుతోపాటు భవిష్యత్తులో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసుకోబోతున్నామని, పెద్ద ఎత్తున ఫార్మా, ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. న్యూయార్క్‌తో పోటీపడేలా మహేశ్వరంలో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. హయత్‌నగర్‌కు త్వరలోనే మెట్రో రైలు రాబోతున్నదని తెలిపారు.
ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతంలో ఫీల్మ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఏవీఎన్‌రెడ్డి, దయానంద్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్ ఉన్నారు.

Cm
గౌడన్నలకు అధునాతన మోకులు
బీఆర్ఎస్ హయాంలోనే రూపకల్పన
హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగా ణ): తాటిచెట్టుపై నుంచి పడి ప్రతి సంవత్సరం ఎంతోమంది కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వాటి నివారణకు అ ధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేఫ్టీ మోకు లు రూపొందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీసీ సంక్షేమశాఖకు బాధ్యతలు అప్పగించి దాదాపు రూ. 8 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమశాఖ ఆ బాధ్యత ను ఓ ఏజెన్సీకి అప్పగించింది.
ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఆ ఏజెన్సీ సేఫ్టీ మోకులను రూపొందించింది. అప్పుడే వాటిని పంపిణీ చే యాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయ గా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు ‘కాటమయ్య రక్షణ కిట్లు’ పేరిట కాం గ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవి అవే. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి అందించాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సేఫ్టీమోకు రూ. 9 వేలపైనే ఉంటుందని అధికారులు తెలిపారు.