హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ రెడ్డి (BR Ambedkar) నివాళులు అర్పించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్‌తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. కాగా, సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్‌కు పేరువస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. బాబాసాహెబ్ జన్మదినం సందర్భంగా ప్రజలు సందర్శించేందుకు కూడా అనుమతించడం లేదు.