CM Revanth Reddy |హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తె లంగాణ): ఒకవైపు రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు చేస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేశామని చెప్తూ మరాఠీ పత్రికలకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రకటనల కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలసింది.
ఆరు మరాఠీ పత్రికలకు, మూ డు ఇంగ్లిష్ పత్రికలకు ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం. యాడ్‌లో ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమం త్రి, సమాచార శాఖ మంత్రి ఫొటోలు వేశా రు. వారితోపాటు చిన్న సైజులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఫొటోలు కూడా వేశారు. ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటనలను ఐఅండ్ పీఆర్ నుంచి కాకుండా ప్రైవేటు యాడ్స్‌గా కలరింగ్ ఇస్తున్నట్టు సమాచారం.
ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకొని, దాని పేరు మీద ప్రతికలకు వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో 13 పథకాలు అమలు చేసినట్టు ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద పథకం 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్టు ఓ ప్రకటన పేర్కొంది. పొదుపు మహిళా సం ఘాలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్టు, 50 వేల ఉద్యోగాలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చినట్టు పంచరంగుల చిత్రాలతో మొదటి పేజీ యాడ్స్ ఇచ్చారు.