హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులై బదిలీపై వెళ్తున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ఆదివారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం, మంత్రులు శాలువాతో సన్మానించారు. జిష్ణుదేవ్ వర్మ స్థానంలో తెలంగాణ నూతన గవర్నర్‌గా నియామకమైన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈనెల 11న బాధ్యతలు స్వీకరించనున్నట్టు లోక్‌భవన్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.