హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. మిస్ వరల్డ్ ముగింపు వేడుకలకు రావాలని గవర్నర్‌ను సీఎం ఆహ్వానించినట్టు సమాచారం. అలాగే ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్‌పై చర్చించినట్టు తెలిసింది.