హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 21వ తేదీన కలెక్టర్ల(Collectors )తో కీలక సదస్సు(Conference) నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్ ఇదే. ప్రధానంగా ఆరు గ్యారంటీ(Six guarantees)ల అమలుతోపాటు భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.