హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం బీహార్ వెళ్లారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర ఉన్నారు. పాట్నాలో బుధవారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో వీరు పాల్గొంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అనంతరం తమిళనాడు వెళ్తారు. గురువారం చెన్నైలో సీఎం స్టాలిన్ ‘నీట్’పై నిర్వహించే సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. కాగా, రేవంత్ సీఎం అయ్యాక ప్రతి ఐదు రోజులకోసారి విమానం ఎక్కుతుండటం గమనార్హం.