Harish Rao : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ డొల్ల అని, అందుకే దానికి సంబంధించిన పత్రాలను చించివేశామని హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఆ హామీలను ఈ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. కోటి మంది మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మాటతప్పారని అన్నారు.
ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని, అందుకు నీటిపారుదల శాఖ పద్దుపై చర్చ సమయంలో మమ్మల్ని సస్పెండ్ చేశారని హరీష్‌రావు మండిపపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై నిలదీశామని అన్నారు. 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే చెప్పిందని చెప్పారు. సీఎం రేవంత్ మాత్రం 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.