Revanth Reddy | ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీకి పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో కూడా మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఎన్డీయే మొత్తం అతుకుల బొంతలా తయారైందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలిచేటట్టు ఉంటే అతుకుల బొంత ఎందుకు అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఇంతమందిని ఎందుకు అడుక్కుంటున్నారని అన్నారు. ఓడిపోతారన్న భయంతోనే పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. నిన్నటివరకు కొందరు నేతలపై అక్రమ కేసులు బనాయించారని.. ఇప్పుడు వాళ్లతోనే పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.బీజేపీ కాలం చెల్లిందని ఆయన ఆరోపించారు.
NDA = “Patchwork”
ఎన్డీయే = అతుకులబొంత400 సీట్లు వచ్చేదుంటే నరేంద్ర మోడీకి … చంద్రబాబు నాయుడు & నవీన్ పట్నాయక్ తో పొత్తు ఎందుకు కావాలి.
— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిWhy Narendra Modi needs Chandrababu Naidu or Naveen Patnaik if they are getting 400 seats.
— CM… pic.twitter.com/mA9S3gN52a— Congress for Telangana (@Congress4TS) March 9, 2024