INDW vs SLW : పొట్టి ప్రపంచకప్ ముందర భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. నాలుగో టీ20లోనూ శ్రీలంకను చిత్తు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(80), షఫాలీ వర్మ(79), అర్ధ శతకాలతో భారీ స్కోర్ అందించగా.. వైష్ణవీ శర్మ(2-24) , అరుంధతి రెడ్డి(2-42)లు బంతితో రాణించారు. భారీ ఛేదనలో హాఫ్ సెంచరీతో చమరి ఆటపట్టు(52)ను వెనక్కి పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పింది వైష్ణవి. దాంతో.. 191కే పరిమితమైన పర్యాటక జట్టు 30 పరుగుల తేడాతో మట్టికరిచింది. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు మరొక విజయం దూరంలో ఉంది హర్మన్‌ప్రీత్ సేన.
స్వదేశంలో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో భారత జట్టుకు శ్రీలంక కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది. వైజాగ్‌లో వరుసగా రెండు, త్రివేండ్రంలోనూ ఓటమితో సిరీస్ సమర్పించుకున్న లంక.. నాలుగో మ్యాచ్‌లోనూ చతికిలపడింది. టీమిండియా నిర్దేశించిన 222 పరుగుల ఛేదనలో ఆటపట్టు సేన బ్యాటింగ్ దళం గట్టిగానే పోరాడింది. కానీ, మిడిలార్డర్ వైఫల్యం.. వైష్ణవీ శర్మ(2-24) , అరుంధతి రెడ్డి(2-42)లు చెలరేగగా.. లంక చేతులెత్తేసింది.
Bit of a juggle but hangs onto it 👏
G.Kamalini makes an impact at the boundary 👊
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/muu6lStT1H
— BCCI Women (@BCCIWomen) December 28, 2025
భారీ ఛేదనను శ్రీలంక దూకుడుగా మొదలెట్టింది. గత మూడు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్లు చమరి ఆటపట్టు(52), హాసిని పెరీరా(33)లు ఈ సారి బౌండరీలతో స్కోర్‌బోర్డును ఉరికించారు. వీరిద్దరి మెరుపులతో నాలుగో ఓవర్లోనే స్కోర్ 50 దాటింది. దంచేస్తున్ను ఈ ద్వయాన్ని అరుంధతి రెడ్డి విడదీసింది. ఆమె ఓవర్లో పెరీరా లాంగాన్‌లో హర్మన్‌ప్రీత్ చేతికి చిక్కింది. ఆ తర్వాత ఇమేశ దులానీ(29)తో కలిసి ఆటపట్టు కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. అమన్‌జోత్, శ్రీచరణి ఓవర్లో సిక్సర్లతో చెలరేగిన తను.. అర్ద శతకం పూర్తయ్యాక వైష్ణవీ శర్మ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించి మంధాన చేతికి చిక్కింది. అక్కడి నుంచి లంక స్కోర్ నెమ్మదించింది. డేంజరస్ దులానీని అమన్‌జోత్ రనౌట్ చేయగా.. కాసేపటికే వైష్ణవి ఓవర్లో హర్షిత సమరవిక్రమ(20) స్టంపౌట్ అయింది. ఆఖర్లో నీలాక్షి డిసిల్వా(23 నాటౌట్), కవిశ దిల్హరి(13) పోరాడినా పరుగుల అంతరం తగ్గించగలిగారంతే. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసిన శ్రీలంక.. 30 పరుగులతో ఓటమిపాలైంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 30న ఇదే వేదికపై జరుగనుంది.
Partnership broken ⚡️
Vaishnavi Sharma delights #TeamIndia with her 1⃣st wicket 👌
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/taNIfvDRUY
— BCCI Women (@BCCIWomen) December 28, 2025
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ కొట్టింది. త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక బౌలర్లకు దడ పుట్టిస్తూ ఓపెనర్లు షపాలీ వర్మ(79), స్మృతి మంధాన(80)లు శుభారంభమిచ్చారు. షెహానీ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన మంధాన.. ఆ తర్వాత కావ్య బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టింది. వరుసగా రెండు అర్ద శతకాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న షఫాలీ సైతం ఫోర్లతో విరుచుకుపడింది. లంక కెప్టెన్ వేసిన ఆరో ఓవర్లో షషాలీ రెండు ఫోర్లు సంధించింది. దాంతో.. పవర్ ప్లేలో టీమిండియా 61 రన్స్ చేసింది.