ఢాకా : బంగ్లాదేశ్లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులు మేఘాలయ సరిహద్దు మీదుగా భారత్కు పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సరిహద్దు దాటి వచ్చిన వారిని తొలుత పుర్తి అనే వ్యక్తి, తర్వాత సమీ అనే ట్యాక్సీ డైవర్ రిసీవ్ చేసుకున్నారని, వారిని మేఘాలయలోని తురా నగరానికి తీసుకువెళ్లారని పేర్కొన్నట్టు డైలీ స్టార్ పత్రిక వెల్లడించింది.
అనుమానితులకు సహాయం చేసిన ఇద్దరినీ భారత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. అయితే బంగ్లా పోలీసుల ఆరోపణలు నిరాధారమని బీఎస్ఎఫ్ ఖండించింది.