హైదరాబాద్, జూన్24 (నమస్తే తెలంగాణ): ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్‌ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలని అధికారుల ను ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ రూ పొందించాలని సూచించింది. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలస్యం గా హడావుడి మొదలుపెట్టింది. అందులో భాగంగా సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జలసౌధలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఆర్డీఎస్‌పై చర్చించారు. తెలంగాణకు కేటాయించిన నీటి ని సమర్థవంతంగా వినియోగించుకొనేందుకు అవసరమైన ఇంజినీరింగ్, పరిపాలనా, అంతర్రాష్ట్ర సమన్వయ చర్యలు, తుమ్మిళ్ల ఎత్తిపోత ల పథకం పురోగతిపై చర్చించారు.
అనంత రం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్డీఎస్ కింద రాష్ట్రానికి 15 టీఎంసీల కేటాయింపులున్నా, ప్రస్తుతం 5నుంచి 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని వివరించారు. పూడిక పేరుకుపోవడం, నిర్మాణపరమైన అవరోధాలు, కాలువ లో నీటి ప్రవాహ ఆటంకాలతోనే ఆర్డీఎస్ కా లువకు తగినంత నీరు చేరడం లేదని వెల్లడించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యామ్నాయాలు, తుమ్మిళ్ల లిఫ్ట్ ఫేజ్-2 పనులు, మల్లమ్మకుంట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5నుంచి 6 టీ ఎంసీలకు పెంచేందుకు అవసరమైతే అదనపు భూసేకరణ చేపట్టే అంశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తక్షణ చ ర్యగా డ్రెడ్జింగ్(పూడిక తొలగింపు) చేపట్టడం, కాలువ హెడ్, ఆధునీకరణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర స మన్వయ వ్యవస్థలు సహా అన్ని అవకాశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
చర్చలకు సిద్ధం చేయండి
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ, తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం కాగితాలపై కేటాయింపులుంటే సరిపోదని, ఆ నీరు రైతుల పొలాలకు చేరేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ సలహదారు ఆదిత్యానాథ్‌దాస్, కార్యదర్శి శ్రీధర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆమోదం తెలిపి.. అసంబద్ధ వాదనలు
ఇబ్బడిముబ్బడిగా కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఇ ప్పుడు అసంబద్ధ, అడ్డగోలు వాదనలకు దిగుతున్నది. ఆర్డీఎస్కు నీరందకపోవడానికి పూ డిక, సాంకేతిక, నదీ ప్రవాహ మార్పులే కారణాలంటూ నమ్మబలికేందుకు సిద్ధమైంది. తా జా సీఎం సమీక్షలో కూడా ఎకడా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నీటి దోపిడీ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవంగా ఆర్డీఎస్లో కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు కాగా, ఆ రాష్ట్ర వార్షిక వినియోగం సగటున 5 టీఎంసీలు. ఏపీకి సుంకేశుల ద్వారా కేసీ కాలువ కే టాయింపులు 39 టీఎంసీలు కాగా, ఆ రాష్ట్ర వాటా వినియోగం ఏటా 60 టీఎంసీలు. కానీ ఒక్క తెలంగాణ మాత్రమే ఆర్డీఎస్ కేటాయింపులు 15 టీఎంసీలుకు, 5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నది. ఎగు వ రాష్ర్టాల జలదోపిడీ, ఇబ్బడిముబ్బడిగా కడుతున్న ప్రాజెక్టులే అందుకు కారణాలు.
బీఆర్ఎస్ హయాంలో నడిచిన పంపులు
బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను ఏర్పాటుచేసిన తర్వాతే ఆర్డీఎస్ చివరను న్న 50వేల ఎకరాలకు నీరందడం మొదలైంది. బీఆర్ఎస్ ఉన్నంతకాలం పంపులు నడిచాయి. కాంగ్రెస్ వచ్చాక పంపులు మూలనపడ్డాయి. ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులపై గతంలో బీఆర్ఎస్ హయాంలోనే కేఆర్ఎంబీలో చర్చ జరిగింది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయించాలని ఆనాడే నిర్ణయించారు. కానీ ఏపీ నిధులివ్వకుండా, మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టకుండా కర్ణాటకను ఎప్పటికప్పుడు అడ్డుకొంటున్నది. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆర్డీఎస్కు ఉరివేస్తూ కర్ణాటక, మరోవైపు ఏపీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తెలుపడం, వ్యతిరేకించాల్సిన తెలంగాణ అందుకు ఆమోదం తె లుపుతూ, ఇప్పుడు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని ఆదేశాలివ్వడం చర్చనీయాశమైంది. కేవలం కర్ణాటకను నిలువరించలేకే హడావుడి చేస్తున్నదని తెలంగా ణ ఇంజినీర్లు చర్చించుకొంటున్నారు.