మాదాపూర్, డిసెంబర్ 4: దివంగత కొణిజేటి రోశయ్య వంటి సహచరుడు ఇప్పుడు లేకపోవడం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఎందరో ముఖ్యమంత్రులకు కుడిభుజంగా పనిచేశారని, అటువంటి వ్యూహకర్తలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్థంతి సందర్భంగా బుధవారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ముఖ్యమంత్రు లు ఎందరు మారినా నంబర్ 2 స్థానంలో పర్మినెంట్‌గా రోశయ్య ఉండేవారని అన్నారు. ఆయన ఏనాడూ ముఖ్యమంత్రి పదవిని ఆ శించలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా నమ్మకంగా ఉండటం వల్లనే మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, భవనం వెంకట్రామ్, టీ అంజయ్య, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు అందరూ ప్రశాంతంగా అధికారం చెలాయించారని అన్నారు. ప్రస్తు తం తెలంగాణ శాసనసభలో రోశయ్యలా వ్యూ హాత్మకంగా సమస్యలను పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం లోటుగా ఉన్నదని అన్నారు. అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించొచ్చని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోశయ్య చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. రోశయ్యది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, వివిధ హోదాల్లో 50 ఏండ్లకు పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారని కొనియాడారు.
ఆర్యవైశ్యులకు సముచిత స్థానం
రాష్ట్ర ఆర్థిక ఎదురుగదల ఆర్యవైశ్యుల చేతి లో ఉన్నదని, వారు తెలంగాణకు బ్రాండ్ అం బాసిడర్లు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆన్యవైశ్యుల వ్యాపారాలకు అనుమతులను ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం తరుపున రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.