అంబర్‌పేట, మే 30: జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవతరణ ఉత్సవాలకు రావాలని కోరుతూ ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవితో కలిసి విద్యానగర్‌లోని ఆయన ఇంటికి సీఎం స్వయంగా వెళ్లారు.
రామయ్యను శాలువాతో సన్మానించారు. రాష్ర్టావతరణ ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.