Donthu Ramesh | ఓ మంత్రితోపాటు ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో అర్థరాత్రి అరెస్టైన వ్యవహారంలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టులు సుధీర్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ 14వ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని తప్పుకు జర్నలిస్టులను అరెస్ట్ చేసి.. 24 గంటలు మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్ ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్‌ను విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా.. సీనియర్ పాత్రికేయులు చారి, దళిత జర్నలిస్ట్ సుధీర్‌ను పోలీసులు ఇంట్లోకి చొరబడి పట్టుకెళ్లారని తెలిసిందే.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని తప్పుకు జర్నలిస్టులను అరెస్ట్ చేసి.. 24 గంటలు మానసిక క్షోభకు గురిచేసింది – సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ https://t.co/wyVggXgDjr pic.twitter.com/rFzZem2OJb
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026
Journalists | తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. జర్నలిస్టులకు బెయిల్