Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ని కూడా చిత్రబృందం సంక్రాంతి పండుగా కానుకగా విడుదల చేసింది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ ఆస్థాన రచయిత మరియు దర్శకుడు రత్నా కుమార్ మళ్ళీ లోకీ (Lokesh Kanagaraj Team) టీమ్‌లోకి వచ్చేశారని సమాచారం. అల్లు అర్జున్ కోసం సిద్ధం చేస్తున్న పవర్ఫుల్ స్క్రిప్ట్ వర్క్‌లో ఆయన భాగమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రత్నకూమార్ కూడా ఎక్స్ వేదికగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లోని సహజత్వం మరియు పవర్ఫుల్ డైలాగ్స్ వెనుక రత్నా కుమార్ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘మాస్టర్’, ‘విక్రమ్’ మరియు ‘లియో’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా రత్నా కుమార్ అందించే పదునైన సంభాషణలు మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజమ్స్‌కు తగ్గట్లుగా లోకేష్ మార్క్ యాక్షన్, రత్నా కుమార్ డైలాగ్స్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉండగా.. ఈ ప్రాజెక్ట్ అనంతరం లోకేష్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, రత్నా కుమార్ టీమ్‌లోకి రావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Happy to be part of this Magnum opus. Here We Go 🥳✍️🚀. #AA23 #LK7. https://t.co/VYcVrT83Vt
— Rathna kumar (@MrRathna) January 14, 2026