Journalists | ఓ మంత్రితో పాటు ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టులు సుధీర్, పరిపూర్ణచారిని అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని.. అరస్టైన జర్నలిస్టుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని వెంటనే వారిని విడుదల చేయాలని మీడియా సంఘాలు, రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. NTV జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ల రిమాండ్ తిరస్కరించింది. వారికి 14వ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బ్రేకింగ్ న్యూస్
NTV జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ల రిమాండ్ తిరస్కరించిన మేజిస్ట్రేట్
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు.. NTV జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసిన 14వ మెజిస్ట్రేట్ కోర్టు https://t.co/ujkcRuGZaw
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026