హైదారాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని, తెలంగాణలో పోలీసులు శాంతి భద్రతలను ఏమాత్రం వైఫల్యం లేకుండా కాపాడుతున్నారని చెప్పా రు. సోమవారం గోషామహల్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ నివాళులర్పించారు. కేఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమే శ్ చంద్ర, కృష్ణప్రసాద్ లాంటి వందలాది మం ది పోలీసు అధికారులు అమరులై శాంతి భద్రతలను కాపాడటంలో స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. అందుకే పోలీసులు విధి నిర్వహణ లో చనిపోతే రూ.కోటి వరకు పరిహారం అం దించేలా పనిచేస్తామని చెప్పారు. పంజాబ్‌లో యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారని, తెలంగాణ రాష్ట్రం కూడా విపతర పరిస్థితులు ఎదురొంటోందని చెప్పారు.
ముత్యాలమ్మ గుడిపై దాడి సంఘటన ఆందోళనకరమన్నారు. నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని చెప్పా రు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ సూల్ని 50 ఎకరాల్లో ప్రారంభించబోతున్నట్టు చెప్పిన సీఎం, సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సూల్కు శంకుస్థాపన చేశారు.
మం త్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ డీజీ బీ శివధర్‌రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, ఏడీజీలు సంజయ్‌కుమార్ జైన్, మహేశ్‌భగవత్, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. రాష్ర్టానికి చెందిన యూనిఫాం సేవా విభాగాలవారి పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ సూల్ను ఏర్పాటు చేస్తూ జీవో 72 జారీ అయింది.
హోంగార్డుల ఊసెత్తని సీఎం
పోలీసు అమర వీరుల సంస్మరణ ది నోత్సవం సందర్భంగా పోలీసుల సేవల ను కీర్తించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తమ సేవల గురించి కనీసం మాట్లాడకపోవడంపై హోంగార్డులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. చాలీచాలని జీ తాలతో కష్టపడుతున్న తమ వెల్ఫేర్ గు రించి సీఎం ఏదో ఒక శుభవార్త చెప్తారని ఆశించామని వాపోయారు. కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్‌ల వరకు కోటి రూపాయ ల పరిహారం ఇస్తామన్న సీఎం.. తమ గురించి, తమ ఆర్థిక భద్రత గురించి ఒ క్కమాట మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆది నుంచీ కోవర్టుల పేరుతో హోంగార్డులను నక్సల్స్ చంపుతున్నార ని, వికారుద్దీన్ అనే ఉగ్రవాది చేతిలోనూ హోంగార్డు బాలస్వామి హైదరాబాద్ సిటీలో చనిపోయాడని, మిర్యాలగూడ ఫైరింగ్‌లో ఎస్సై సైదులుతో పాటు హోం గార్డు మహేశ్ చనిపోయాడని, వారి త్యాగాలు వృథాగా పోయినట్టేనా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఎంత సర్వీసు చేసినా, మా ప్రాణాలంటే ప్రభుత్వానికి విలువలేదా?’ అని వాపోయారు.