హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షలో జీవో 29 ద్వారా ఎకువ శాతం బీసీలకు అవకాశం వచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ లెక్కల్లో నిజాయితీ ఉందని నమ్మితే అశోక్‌నగర్‌లో గానీ, సెంట్రల్ లైబ్రరీలో గానీ, అమరవీరుల స్థూ పం వద్దగానీ బహిరంగ చర్చకు సిద్ధమా? అని మంగళవారం ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. నిరుద్యోగులకు చేస్తున్న పచ్చి మోసం, దగాకు ప్రతీక సీఎం చెప్పిన అబద్ధపు లెక్కలని మండిపడ్డారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 5: మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులను పంపేందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను మార్చి గన్నీ బ్యాగుల టెండర్లను నిర్వహించిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మాట్లాడారు. గన్నీ బ్యాగులను తీసుకునేందుకు టెండర్లు పిలిచారని తెలిపారు. తమ హయాంలో ఒక్క బ్యాగుకు రూ.14 నుంచి రూ.16లోపు వెచ్చించి తీసుకున్నామని, ప్రభుత్వం నిబంధనలు మార్చి రూ.20 నుంచి రూ.30 వెచ్చించి బ్యాగులను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.