హైదరాబాద్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ మీద వేటు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల మీద అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారని సీఎంవో అధికారులు చెప్తున్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇది 77వ సారి.
మంగళ, బుధవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. తమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించనున్న భేటీలో కూడా సీఎం పాల్గొంటారని చెప్తున్నారు. సెప్టెంబర్ 2న అకడ వైఎస్ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం పాల్గొనే అవకాశాలు ఉన్నాయని, సెప్టెంబర్ 3న కేసీ వేణుగోపాల్‌ను కలిసి తిరిగి హైదరాబాద్‌కు వస్తారని చెప్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు.