హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి 49వసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతోపాటు అగ్రనేత రాహుల్‌గాంధీకి వివరించనున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని రాష్ర్టాల ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ఏడాది నుంచి రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈసారైనా రేవంత్‌రెడ్డికి.. రాహుల్ అపాయింట్మెంట్ దక్కుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక్కడేమో రాహుల్‌ను కలవబోతున్నట్టు మీడియాకు లీకులివ్వడం, ఢిల్లీ వెళ్లి ఆయనను కలవకుండానే వెనుదిరిగిరావడం పరిపాటిగా మారిందనే చర్చ కూడా జరుగుతున్నది.