Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో 21వ పర్యటన కానున్నది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణం చేసిన తర్వాత.. సీఎం, పీసీసీ అధ్యక్షుడు కలిసి ఢిల్లీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలువనున్నట్టు పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి స్పష్టత కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా చర్చించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.