Home
Telangana
Cm Revanth Reddy Conduct Another Review Today Regarding The Progress Of Repair Works At The Medigadda Annaram And Sundilla Barrages Which Are Part Of The Kaleshwaram Project
నేడు ‘కాళేశ్వరం’పై రేవంత్ సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు నిర్మాణ ఏజెన్సీలు, సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థలు, ఇరిగేషన్‌శాఖ అధికారులతో చర్చించనున్నారు.
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్ట్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సమాలోచనలు జరుపనున్నట్లు సమాచారం. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, అక్కడి నీటి తరలింపు అంశానికి సంబంధించిన అలైన్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించనున్నారని తెలిసింది. అం దుకు అనుగుణంగా సిద్ధమై రావాలని సీఎంవో నుంచి ఇప్పటికే సమాచారం అందినట్లు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

