హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణభవన్, ఆంధ్రప్రదేశ్ భవన్‌తోపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల విభజనపై సమీక్షించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్‌జాజుతో చ ర్చించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందు లో ఉన్న భవనాలు ఎన్ని? వాటి స్థితి ఏమిటి? అం దులో తెలంగాణ వాటా ఎంత? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, అం దులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ న ర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉ న్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించగా.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళ్తుందని అధికారులు తెలిపారు.
మూడు, నాలుగు భవనాలు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం తన కు పరిచయం ఉన్న ఎం పీలకు విందు ఇచ్చారు.
త్వరలో ఢిల్లీలోని అధికారిక భవనంలోకి సీఎం
రేవంత్‌రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వా త తొలిసారి ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని 23వ నంబర్ బంగ్లా (అధికారిక నివాసం)ను సందర్శించారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉన్న యమున అపార్ట్మెంట్లోని 902 ఫ్లాట్‌ను త్వరలోనే ఖాళీ చేస్తారు. తుగ్లక్ రోడ్డులోని బంగ్లాలో మార్పుచేర్పులు చేసి పూజా కార్యక్రమాల తర్వాత అందులోకి వెళ్తారు.
ఢిల్లీ అధికారిక భవనంలో కేసీఆర్ 20 ఏం డ్లు నివాసం ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్ రోడ్డు నివాసం నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ తొలివారం వరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌కు అదే అధికారిక నివాసంగా అదే బంగ్లా. తెలంగాణలో ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిబ్బంది ఆ బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు.