హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్’ హైదరాబాద్‌లో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. అ మెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు, అధికారుల బృందం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని జోయిటిస్ తెలిపిం ది. భారత్‌లో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని జోయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్ బాగ్ పేర్కొన్నా రు. హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్ ట్రాక్టర్స్ కూడా ముందుకొచ్చిం ది. తమ ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధం గా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని సీఈవో ప్రవీణ్ పెన్మెత్స వెల్లడించారు.
దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. స్టాన్ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో స్టా న్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ఈ మేరకు తగిన సహకా రం అందిస్తామని బయోడిజైన్ విభాగం అ ధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ తెలిపారు. ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను అందజేశారు. కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూ లో ఉన్న గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. కాలిఫోర్ని యా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్‌చరణ్‌ను కలిశా రు. ఆయన అనుభవం తెలంగాణ పురోగతి కి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.