హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కొందరు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిం చారు. ఎరువుల కోసం చాలామంది క్యూలైన్లలో నిలబడ్డట్టు పేపర్లు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరతపై ఇటీవల రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందులో ఎరువులు దొరకడంలేదని, తక్కువ ఉన్నా యని భయపెట్టడంతో రైతులు తెల్లవారగానే దుకాణాలు, పీఏసీఎస్‌లు, పంచాయతీల ఎదుట బారులు తీరుతున్నారని చెప్పారు. చాలా మంది నెటిజన్లు ఆధారాలతో కూడిన చిత్రాలు చూపుతూ సెటైర్లు వేస్తున్నారు. సీఎం తప్పుదోవ పట్టించారని చెప్తున్నారు.