కొందరు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిం చారు. ఎరువుల కోసం చాలామంది క్యూలైన్లలో నిలబడ్డట్టు పేపర్లు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను తీవ్ర నిరుత్సాహపరిచింది. బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 వార్షిక బడ్జెట్లో వ్యవసాయరంగానికి గతంలో మాదిరిగానే కేటాయింపులను మమ అనిపించింది.